పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఎంతో కొంత తగ్గినా మేలే కదా అని అవసరం ఉన్న ప్రజలు స్తోమతబట్టి కొంటున్నారు. కొన్నాళ్లుగా పసిడి ధరలు పడిపోతుండడంతో కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. గురువారం కూడా బులియన్ మార్కెట్ నేల చూపులు చూసింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో బంగారు, వెండి ధరలు దిగి వచ్చాయి. భాగ్యనగరంలో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 350 తగ్గి 54,100కు చేరింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 59020 వద్ద కొసాగుతోంది. ప్రొద్దుటూరులో 22, 24 కేరట్ల ధరలు వరసగా రూ. 53,983, రూ. 58,934 పలుకుతున్నాయి.
మరోవైపు వెండి కూడా పతనం దిశగా నడుస్తోంది. కేజీ ధర రూ. 500 తగ్గి రూ. 75,700 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా ఫెడరల్ బ్యాంకు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పసిడి ధరలు పెరుగుతున్నాయి. డాలర్ ధర పుంజుకోవడంతో మదుపర్లు షేర్ మార్కెట్‌వైపు వెళ్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.