Traffic Challans : బీ అలర్ట్..పెండింగ్ చలాన్ల డిస్కౌంట్కు ఇవాళే లాస్ట్ డేట్

Byline :  Krishna
Update: 2024-01-10 02:54 GMT

తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్లకు సంబంధించి ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ ఆఫర్ గత నెల 26న ప్రారంభమవ్వగా.. ఇవాళే చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్ చలాన్లపై బైకులు, ఆటోలకు 80శాతం.. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటివరకు 1.14 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి. దీన్ని ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం వచ్చింది.

పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ఇవాళే చివరి రోజు కావడంతో ఆదాయం భారీగా వచ్చే అవకాశం ఉందిని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇవాళే లాస్ట్ డేట్ కావడంతో వాహనదారులు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. చలాన్లు చెల్లించే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. అధికారిక వెబ్ సైట్, పేమెంట్ యాప్లలో మాత్రమే చలాన్లు కట్టాలని సూచిస్తున్నారు. చలానాల చెల్లింపులో ఏమైనా సందేహాలు ఉంటే.. 040-27852721, 87126616909 నెంబర్లను సంప్రదించాలని చెప్పారు.

కాగా 2022లో గత ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉంటే.. వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇవ్వగా.. దీంతో వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు జనం ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Tags:    

Similar News