హైదరాబాద్‌లో నేడు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్తుంటే ఇలా..

Update: 2023-08-19 02:28 GMT

హైదరాబాద్ నగరంలో రెండు కార్యాక్రమాల వల్ల శనివారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. స్టీల్ బ్రిడ్జి ప్రారంభం కారణంగా ఇందిరాపార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు ప్రభుత్వా ఆర్థిక సాయానికి సంబంధించిన మరో కార్యక్రమం ఉండడంతో చుట్టుపక్కల ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు.

ఇందిరా పార్క్ వైపు..

లోయర్ ట్యాంక్‌బండ్ కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ఇందిరాపార్కు ఎక్స్‌రోడ్డు మధ్య స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం కారణంగా ఉదయం 9 నుంచి 12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ నుంచి ఇందిరాపార్కు ఎక్స్‌ రోడ్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించబోమని నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.

వాహనదారులు కట్టమైసమ్మ గుడి వద్ద లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎమ్మార్యో ఆఫీసు, స్విమ్మింగ్‌ ఫూల్‌, ఇందిరాపార్కు ఎక్స్‌ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి కట్ట మైసమ్మ ఆలయం వైపు వాహనాలను అనుమతించరు. ఇందిపార్కు ఎక్స్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ను బండ మైసమ్మ, స్విమ్మింగ్‌ పూల్‌, ఎమ్మార్వో ఆఫీసు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.

ఎల్బీ స్టేడియం వైపు..

చాపెల్ రోడ్, నాంపల్లి నుండి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనదారులు ఏఆర్ పెట్రోల్ పంపు వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వైపు నుండి ప్రెస్ క్లబ్/బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వైపు వెళ్లే వాహనదారులు ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్ వైపు వెళ్లాలి.

రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం/ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వైపు వెళ్లే వాహనదారులు ఫతే మైదాన్ వద్ద ఉన్న సుజాత హైస్కూల్ వైపు వెళ్లాలి. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వరకు వెళ్లి చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనదారులు ఓల్డ్ ఎమ్మెల్యే క్యూటిఆర్‌ఎస్ వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు వెళ్లాలి. కింగ్ కోటి, బొగ్గులకుంట నుంచి బషీర్‌బాగ్‌కు వెళ్లే వాహనదారులు కింగ్ కోటి క్రాస్ రోడ్స్ వద్ద తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్ వైపు వెళ్లాలి.

Tags:    

Similar News