రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ సెగ తగిలింది. ఈ క్రమంలో కేసీఆర్ కు సొంత నియోజకవర్గ పార్టీ నేతలు షాకిచ్చారు. రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన తుప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఫిబ్రవరి 12న 11 మంది సభ్యులతో కలిసి కలెక్టర్ కు అవిశ్వసం నోటీసులు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సినియర్ నాయకులు.. ఒక కౌన్సిలర్‌ను రాజకీయ ఒత్తిళ్లకి గురిచేసి లోబరుచుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు షాకిచ్చింది. 10 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి అవిశ్వాసంకు మద్దతునిచ్చారు. దీంతో మున్సిపల్ చైర్మన్ రవీందర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో జయచంద్ర రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేయగా.. అందరూ హాజరై రవీందర్ కు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న నందాల శ్రీనివాస్ ఇంచార్జ్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కొత్త చైర్మన్ కోసం ఎన్నికలు త్వరలో ప్రకటిస్తామని ఆర్డీఓ తెలిపారు.