Revanth Reddy: కేసీఆర్కు సవాల్.. అమరవీరుల స్థూపం వద్దకు రేవంత్

By :  Krishna
Update: 2023-10-17 06:40 GMT

రాజకీయ నేతల సవాళ్లు - ప్రతిసవాళ్లతో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తున్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చద్దామంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు.

ఇందులో భాగంగా ఒంటిగంటకు ఆయన అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్నారు. ముందుగా సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడినుంచి స్థూపం వద్దకు వెళ్తారు. కాగా కాంగ్రెస్ గ్యారెంటీలను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఎక్స్పైరీ రీ డేట్ అయిపోయిందని.. ఆయన ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.

Tags:    

Similar News