రైతు బంధును నిలిపేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని తీవ్రంగా విమర్శించారు. ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారా అని ప్రశ్నించారు.
కేటీఆర్ ట్వీట్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా అంటూ సటైర్ వేశారు. రైతులపై ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వాలని అన్నారు. వృద్ధులపై శ్రద్ధ ఉంటే ఫించన్, ఉద్యోగులపై బాధ్యతుంటే జీతాలు నవంబర్ 2లోపు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. బుధవారం ఎలక్షన్ కమిషన్ కు తాము అదే చెప్పామని అన్నారు. కేటీఆర్ లాంటి వాడిని చూసే నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుందనే సామెత పుట్టిందని సటైర్ వేశారు. డ్రామాలు ఆపి... నవంబర్ 2లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని.. లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిపెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని రేవంత్ అన్నారు.
ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు...
— Revanth Reddy (@revanth_anumula) October 26, 2023
నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు..
నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు..
నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు..
నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది… https://t.co/Q8416YIeWq