కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు పక్కా.. టీపీసీసీ చీఫ్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ గెలుపు సమిష్టి విజయంగానే భావిస్తామని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా తనకు కూడా క్రెడిట్ ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు. ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదంటూ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్, ఎంఐఎంలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. గతంలో తనకు RSS నేపథ్యం ఉన్నా కూడా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఆ విధానాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. బీజేపీకి బీఆర్‌ఎస్ ఖచ్చితంగా బీ టీమేనని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. పలు సందర్భల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు రేవంత్‌రెడ్డి. అదే క్రమంలో టీడీపీకి చెందిన వర్గాలు మద్దకు కూడా ఉండవచ్చన్నారు
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్ధిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటానన్నారు. రైతుబంధుపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని.. నవంబర్ 15 లోగా రైతుబంధు ఇవ్వాలని కోరామన్నారు. రైతుబంధు ఆపడం వెనుక తమ పాత్ర లేదని, కొందరు కాంగ్రెస్ వాళ్లు ఆపారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతుబంధు ఆగిందంటూ కామెంట్స్ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ పేర్కొన్నారు.