వివేక్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలపై స్పందించిన రేవంత్ రెడ్డి

By :  Kiran
Update: 2023-11-21 17:08 GMT

కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ, ఐటీ సోదాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. చీకటి మిత్రుడు కేసీఆర్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖలను కాంగ్రెస్‌ నేతల ఇళ్లపైకి పంపిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వివేక్‌ ఇంటిపై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఆయన.. ఆ రెండు పార్టీల కుతంత్రాలు కాంగ్రెస్‌ గెలుపును ఆపలేవని అన్నారు.

మంగళవారం చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు జరిపారు. తెల్లవారు జామున సోమాజీగూడతో పాటు మంచిర్యాలలోని వివేక్ నివాసాలతో పాటు బేగంపేటలోని ఆఫీసులో తనిఖీలు చేశారు. దాదాపు 12 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఈడీ, ఐటీ రైడ్స్పై స్పందించిన వివేక్ విశాఖ కంపెనీ నుంచి జరిగిన రూ. 8 కోట్ల బ్యాంక్ లావాదేవీలపై విచారణ జరిగినట్లు చెప్పారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తనపై కుట్ర పన్ని ఐటీ రైడ్స్ చేయించాయని వివేక్ ఆరోపించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


Tags:    

Similar News