నాంపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

By :  Kiran
Update: 2023-11-13 06:58 GMT

హైదారాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని రేవంత్ అన్నారు. వరస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు నిల్వ చేసేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News