200 కోట్ల ఖర్చుతో 2వేల కోట్ల భూముల్ని కాజేసేందుకు కేసీఆర్ కుట్ర : రేవంత్

By :  Krishna
Update: 2023-11-18 16:32 GMT

కామారెడ్డిలో కేసీఆర్ ఓటుకు 10వేలు ఇచ్చి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో 200కోట్లు ఖర్చుపెట్టి 2వేల కోట్ల భూముల్ని లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరులో రేవంత్ రోడ్ షో నిర్వహించారు. కామారెడ్డి రైతుల భూములు కాపాడేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. కేసీఆర్ గుంట భూమి గుంజుకోకుండా ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ అసెంబ్లీ ఎన్నికలు కామారెడ్డి భవిష్యత్తును మార్చేవని రేవంత్ అన్నారు. గజ్వేల్‌లో ఉన్న భూములను కేసీఆర్ ఊడ్చేశారని.. వేలాది ఎకరాలను ఆయన బంధువులు కబ్జా చేశారని ఆరోపించారు. అక్కడ ఏమి మిగలకపోవడంతో కామారెడ్డికి వచ్చారని అన్నారు. కేసీఆర్ అనే అనకొండను వేటాడేందుకే అధిష్టానం తనను కామారెడ్డి నుంచి బరిలోకి దింపిందని చెప్పారు. తాను కామారెడ్డిలో నామినేషన్ వేయడాన్ని చూసిన కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News