Revanth Reddy Arrest: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు రేవంత్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ను అదుపులోకి తీసుకుని గాంధీభవన్కు తరలించినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చద్దామంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. ఇందులో భాగంగా ఆయన అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడంతో పోలీసులు అడ్డుకున్నారు.
అమరవీరుల స్థూపం వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు https://t.co/dBonDbHHwj
— Telangana Congress (@INCTelangana) October 17, 2023