Revanth Reddy పోటీ అక్కడి నుంచే.. దరఖాస్తు చేయనున్న టీపీసీసీ చీఫ్

Update: 2023-08-24 09:53 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ ఇచ్చారు. కొడంగల్ నుంచే ఎన్నికల బరిలో ఉంటానని ఆయన ప్రకటించారు. ఇవాళ గాంధీభవన్లో దరఖాస్తు చేయనున్నట్లు చెప్పారు. కొడంగల్ ప్రజలు తనన ఆశీర్వదించాలని కోరారు. కొడంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. కేసీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

కొడంగల్ ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ విమర్శించారు. దాడులు చేసి గెలవాలని బీఆర్ఎస్ చూస్తోందని.. అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

దాడులు చేయడం తమ విధానం కాదని.. అభివృద్ధి చేయడమే తమ విధానమన్నారు. ‘‘ కొడంగల్‌లో నా హయాంలోనే అభివృద్ధి జరిగింది. నియోజకవర్గానికి తాగునీరు తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చింది నేనే. కొడంగల్‌ నియోజకవర్గానికి 30 సబ్‌స్టేషన్లను తీసుకువచ్చాను’’ అని చెప్పారు.

ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్ అన్నారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కన్పిస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందన్న ఆయన హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతి నెల మొదటి రోజు రూ.4వేలు పెన్షన్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు


Tags:    

Similar News