చూసుకొని వెళ్లండి.. రేపు ఆ రూట్లలో ట్రాఫిక్ బంద్..

By :  Kiran
Update: 2023-11-06 16:41 GMT

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. బీసీ గర్జన సభ జరగనున్న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్కు అనుగుణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మళ్లించే ప్రాంతాలు

ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించరు. అటు వైపు వెళ్లే వాహనదారులను నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.

అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ ఫౌండ్రీ, చాపెల్ రోడ్ వైపు పంపుతారు.

ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాద్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ మీదుగా హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు.

సభకు వచ్చే వారి కోసం ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్జెన్స్, నిజాం కాలేజ్, టెన్నిస్ కోర్ట్, మహబూబియా కాలేజ్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

మోడీ సభ నేపథ్యంలో లుంబినీ పార్క్, ఎన్డీఆర్ గార్డెన్స్, పబ్లిక్ గార్డెన్స్ లోకి పర్యాటకుల్ని అనుమతించరు.




Tags:    

Similar News