కోరుట్లలో అక్క మృతి.. చెల్లి మిస్సింగ్.. అసలేం జరిగిందంటే..?

Byline :  Krishna
Update: 2023-08-30 04:25 GMT

తల్లిదండ్రులు ఓ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో అక్కాచెల్లి ఇద్దరే ఉన్నారు. తెల్లారేసరికి అక్క సోఫాలో శవమై ఉంది. చెల్లి కన్పించడం లేదు. ఈ విషాదం ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఇంట్లో మందు సీసాలు కన్పించడం, చెల్లి మిస్సవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను ఆమె చంపిందా అనే సందేహాలు నెలకొన్నాయి.

భీమునిదుబ్బలో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులకు ఓ కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటుండగా.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ ఇంజినీర్గా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఇక చెల్లి చందన బీటెక్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటుంది. శ్రీనివాస్‌రెడ్డి దంపతులు బంధువుల గృహప్రవేశానికి హైదరాబాద్‌ వెళ్లారు. సోమవారం రాత్రి వారు కూతుళ్లతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి ఫోన్‌ చేయగా.. దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చిన్న కూతురుకు ఫోన్‌కు చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది.

తండ్రి పక్కింటివారికి ఫోన్ చేసి ఇంటికివెళ్లి చూడమనగా.. వారు వెళ్లి తలుపులు తెరిచి చూస్తే దీప్తీ సోఫాలో చనిపోయి ఉంది. వారు వెంటనే తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు. చెల్లి చందన కనిపిచపోవడంతో ఆమె ఆచూకీ కోసం బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆమె ఓ యువకుడితో కలిసి సోమవారం ఉదయం 5.12 నుంచి 5.16 గంటల మధ్య నిజామాబాద్‌ బస్సు ఎక్కినట్లు గుర్తించారు.

తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీప్తిని చందన, ఆమెతో ఉన్న యువకుడే చంపారా.. అక్కను హత్య చేసి చెల్లి పారిపోయిందా.. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి. చందన ఎక్కడికి వెళ్లింది? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చందన, ఆ యువకుడు దొరికితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.



Tags:    

Similar News