నీటి కుంటలో యువతి శవం.. ఏం జరిగిందంటే?

Update: 2023-06-11 10:57 GMT

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో దారుణం జరిగింది. కాళ్లాపూర్‌ గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష అనే యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గ్రామసమీపంలోని నీటికుంటలో యువతి శవమై కన్పించింది.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు వారు అనుమానిస్తున్నారు. ఆమె చంపి కళ్లను ఛిద్రం చేశారని.. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. శిరీష ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది.   

Tags:    

Similar News