కుండపోత వర్షాలు..ఆ రూట్లలో రైళ్లు రద్దు

Update: 2023-07-27 10:30 GMT

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రవాణ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతోంది.

పలు చోట్ల రైల్వే స్టేషన్స్ కూడా ముంపుకు గురయ్యాయి. రైల్వే ట్రాక్స్, ప్లాట్ ఫాంలమీదకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా హసన్ పర్తి- కాజిపేట మార్గంలో ట్రాక్‌పైకి భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వెంటనే రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆ రూట్‌లో నడిచే మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే 11 రైళ్లను దారి మళ్లించింది.

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233), సిర్పూర్‌ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234) రైళ్లు పూర్తిగా రద్దు కాగా, తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్ - తిరుపతి (12762), సికింద్రాబాద్ - సిర్పూర్‌ కాగజ్ నగర్ (12757), సిర్పూర్‌ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు అయ్యాయి.


Tags:    

Similar News