Transfer of DSPs: తెలంగాణలో 61 మంది డీఎస్పీల బదిలీ

Byline :  Veerendra Prasad
Update: 2024-02-18 04:59 GMT

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయగా.. తాజాగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. శనివారం అర్ధరాత్రి రాష్ట్రంలో పనిచేస్తున్న 61 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్‌లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం రోజులుగా పోలీసు శాఖలో ఎస్సై స్థాయి నుండి మొదలుకొని ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఎస్పీల బదిలీ పెద్ద ఎత్తున జరిగింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి.





Tags:    

Similar News