Deputy Collectors Transfers : తెలంగాణలో భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో మరో భారీ బదిలీలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీవో స్థాయి అధికారులకు పెద్దగా పనులు ఏం లేవనే అభిప్రాయం నెలకొంది. కానీ ఇప్పుడు చేసిన బదిలీల తీరును బట్టి త్వరలోనే భూ పరిపాలనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. ఈ మేరకు ఎక్కువకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేయనున్నారు. వీరిలో నుంచి ఇద్దరిని హెచ్ఎండీఏలోకి తీసుకోగా.. ఇంకొందరికి భూ సేకరణ బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.