లోక్ సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పోలీస్, ఆబ్కారీ తదితరుల శాఖల్లో సర్కారు బదీలు చేపట్టిన సంగతి తెలిసిందే. సుల్తాన్‌బజార్ ఏసీపీగా వెంకట్‌రెడ్డి, అల్వాన్ ఏసీపీగా నరేశ్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీగా నరసయ్యను డీజీపీ రవిగూప్తా సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. గతమూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ డిసెంబర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు స్థాన చలనం కల్పిస్తున్నది.