ట్రాన్స్‌జెండర్లలో కొందరు చేస్తున్న నీచపు పనుల వల్ల ఆ జాతి మొత్తానికి కళంకం వస్తోంది. కొందరు పొట్టపోసుకోవడానికి భిక్షాటన చేస్తుంటే, కొందరే రౌడీషీటర్లలా మారి దోపిడీలకు పాల్పడుతున్నారు. హత్యలకు, భౌతిక దాడులు కూడా తెగబడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, గుడి, ఆలయం అన్నిచోట్లా వీరి ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. తాజాగా వేగంగా వెళ్తున్న రైల్లోంచి ఓ యువకుడిని అక్కయ్యలు బయటికి తోశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యేందర్ అనే పాతికేళ్ల యువకుడు ఉపాధి కోసం కొంతమంది మిత్రులతో కలసి హైదరాబాద్‌కు దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వచ్చాడు. రైల్లో దాందా చేస్తున్న ట్రాన్స్‌జెండర్లకు, అతనికి గొడవ జరిగింది. మదమర్రి రైల్వే స్టేషన్ గేటు దగ్గర అక్కయ్యలు అతణ్ని బయటికి గెంటేశారు. రైల్లోని మిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సత్యేందర్‌ను ఆస్పత్రికి తరలించారు.