చూసుకోండి.. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మరి..!

Update: 2023-08-08 05:31 GMT

రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. ఆగస్టు 10న అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్ నిర్వహించనున్నారు. హైదర్ గుడలో ఎస్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన జేఏసీ కన్వినర్ దయానంద్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో విఫలం అయ్యాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, ఆటోలకు కొత్త పర్మిట్, లారీలకు సింగిల్ పర్మిట్ విధానాలను మంజూరు చేయాలని కోరారు. తక్షణమే ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీస్ లను రద్దు చేసి.. రాజస్థాన్, కర్ణాటకల మాదిరి ప్రభుత్వమే ప్రత్యేక యాప్ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వాలు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే లక్షలాది మందితో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News