హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రూల్స్‌ మారాయ్‌

Update: 2023-07-31 12:44 GMT

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఔటర్‎లో ప్రయాణికులు పాటించాల్సిన స్పీడ్ లిమిట్‎కు సంబంధించిన నోటిఫికేషన్‎ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సోమవారం జారీ చేసింది. స్పీడ్ లిమిట్‎ను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్‎తో ఇకపై వాహనాలు 120 కిలమీటర్ల స్పీడుతో ఓఆర్ఆర్‎లో దూసుకెళ్లొచ్చు. లైన్ 1, 2లలో కనిష్టంగా గంటకు 80 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కి.మీ.ల స్పీడుతో వెహికల్స్ ప్రయాణించవచ్చు. అంతకు ముందు ఈ లైన్లలో గరిష్ట వేగం 100 కి.మీ.లుగా ఉండేది. ఈ వేగాన్ని మించి ఏ వాహనం వెళ్లినా ఫైన్ విధించేవారు. తాజాగా స్పీడ్ లిమిట్ 120కి.మీ.లకు పెంచడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఈ కొత్త రూల్స్ డ్రైవింగ్‎లో క్రమశిక్షణను తీసుకువస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యం అని తెలిపారు.

ఓఆర్ఆర్‎లో కొత్త రూల్స్ ఇవే :

* లేన్ 1, 2 లో స్పీడ్ లిమిట్ 100-120 కి.మీ.లు.

* లేన్ 3,4 లో స్పీడ్ లిమిట్ 80-100 కి.మీ.లు.

* లేన్ 5లో స్పీడ్ లిమిట్ 40 కి.మీ.లు.

* ఓఆర్ఆర్‎లో 40 కి.మీ.ల స్పీడ్ కన్నా తక్కువ వెళ్లే వెహికల్స్‎కు నో ఎంట్రీ.

* ఎట్టిపరిస్థితుల్లోనూ లేన్‎ల మధ్య జిగ్-జాగ్ మూమెంట్‎కు అనుమతి లేదు.

* లేన్‌లను మార్చాలనుకునే వారు తప్పనిసరిగా ఇండికేటర్ లైట్లను ఉపయోగించాలి.

* ఓఆర్‌ఆర్‌లోని నాలుగు లేన్‌లలో వాహనం ఎక్కడా ఆగకూడదు. ప్రయాణికులను ఎక్కించుకోకూడదు.

* ఓఆర్ఆర్‎పై టూవీలర్స్‌, పాదచారులకు నో ఎంట్రీ.


Tags:    

Similar News