పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్లో పెళ్లి వేడుకకు వెళ్లిన బస్సు తిరిగి వస్తుండగా.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆటోను తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.