Tribal Welfare officer Jyoti : మరో అవినీతి ఆఫీసర్ అరెస్ట్.. భారీగా డబ్బు, బంగారం స్వాధీనం

Byline :  Krishna
Update: 2024-02-20 06:08 GMT

తెలంగాణలో అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇటీవల రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన వద్ద సుమారు రూ.250 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో మరో అవినీతి అధికారిణి బండారం బయటపడింది. మాసబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్రైబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తోన్న జ్యోతి రూ.84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

జ్యోతి ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఆమె ఇంట్లో ఎక్కడపడితే అక్కడ డబ్బు ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.65లక్షల నగదు, 4 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే ఆమెను ఏసీబీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అక్రమాస్తులపై ఆమెను మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కోర్టులో కస్టడీ పిటిషన్ వేసేందుకు ఏసీబీ ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News