అసెంబ్లీ టికెట్ల కోసం వందల్లో అప్లికేషన్లు.. ఇవాళే లాస్ట్ డేట్..

Update: 2023-08-25 03:39 GMT

గాంధీ భవన్ లో ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ టికెట్ కోసం పలువురు అభ్యర్థులు దరఖాస్తు దాఖలు చేసేందుకు వస్తుండటంతో గాంధీభవన్ లో సందడి నెలకొంది. గురువారం ఒక్కరోజే వివిధ నియోజకవర్గాల నుంచి 200లకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి.

అసెంబ్లీ టికెట్ కోసం పలువురు సీనియర్ నాయకులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, కామారెడ్డి నుంచి షబ్బీర్‌ అలీ, నాగార్జున సాగర్‌ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్‌, మునుగోడు నుంచి కైలాష్‌ తదితరులు పార్టీ టికెట్‌ కోసం అప్లై చేశారు. ఇప్పటి వరకు 700లకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్పాయి.


 



ఇదిలా ఉంటే దరఖాస్తుల సమర్పణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశముంది. అప్లికేషన్లన్నింటినీ స్క్రూటినీ చేసిన అనంతరం వాటిని హైకమాండ్కు పంపనున్నారు. అనంతరం అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.




Tags:    

Similar News