తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ ఈసీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఎలక్షన్ కమిషన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ను నియమించింది. మిగతా జిల్లాలకు ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు వ్యవహరించనున్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఐటీడీఏ పీవోలు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.