తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు

Byline :  Krishna
Update: 2023-08-29 02:34 GMT

తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. గద్వాల్ జిల్లాలోని ఎర్రవల్లి, కామారెడ్డి జిల్లాలోని మహ్మద్‌నగర్‌ నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కీసర మండలంలోని బార్సిగూడను గ్రామ పంచాయతీ చేయనుంది. ఈ మేరకు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. తాజాగా దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇక కామారెడ్డి జిల్లాలోని మహ్మద్‌నగర్‌ను నూతన మండలంగా, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News