Dasoju Sravan Rejected: కేసీఆర్కు గవర్నర్ తమిళిసై మరో ఝలక్.. ఎమ్మెల్సీ..

By :  Krishna
Update: 2023-09-25 09:37 GMT

"తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు". దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సును తిరస్కరించారు. గవర్నర్ కోటాలో వీరి ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించాలని కేసీఆర్ కేబినెట్ గవర్నర్కు సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణ, బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్కు అవకాశం ఇవ్వాలని జులై 31న కేబినెట్ నిర్ణయించి.. గవర్నకు సిఫార్సు చేశారు.

ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దాసోజు శ్రవణ్.. ఉద్యమ సమయంలో చిరంజీవి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మంచి వాగ్దాటి ఉన్న ఆయనకు జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందన్న అసంతృప్తితో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. రెండు నెలలు గడిచినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్‌లో కండువా కప్పుకున్నారు.

Tags:    

Similar News