Dussehra Holidays 2023 : దసరా సెలవులు తగ్గించిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఎన్ని రోజులంటే?
తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, దసరాకు వేళయింది. బతుకుదెరువు కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలు.. పల్లెకు చేరుకుంటారు. కుంటుంబ సభ్యులతో కలిసి దసరా జరుపుకుంటారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు.. ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 24న దసరా పండుగ వస్తుంది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. దీంతో ఈ రెండు పండుగలకు కలిపి మొత్తం 13 రోజులు సెలవులు రానున్నాయి.
ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. 2022లో ప్రభుత్వం 14 రోజుల సెలవులు ఉండగా.. ఈ ఏడాది 13 రోజుల సెలవులే ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలలు తెరుచుకుంటాయి. ఈ సెలవులు పాఠశాలలతో పాటు కాలేజీలకూ వర్తిస్తాయి.