Dharani :ధరణి బాధితులకు శుభవార్త.. రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ

Byline :  Bharath
Update: 2024-02-29 11:53 GMT

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ బాధితులకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను క్లియర్ చేయడానికి గడువును నిర్దేశిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులందరూ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు క్లియర్ చేయాలని సూచించింది. టైమ్ లైన్ ప్రకారం.. మండల తహశీల్దార్ 7 రోజులు, ఆర్వోడీ 3 రోజులు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అంతేకాకుండా పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.

ఈ మేరకు ప్రతీ మండలంలో 2 నుంచి 3 బృందాలను నియమించనున్నారు. ఈ టీంలు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో పనిచేస్తాయి. ప్రతి ధరణి అప్లికేషన్ పరిశీలించి.. ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. దీంతోపాటు ప్రతీ తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారు. వాళ్లు ఏది కూడా పెండింగ్ లో ఉంచొద్దని అధికారులను ఆదేశించారు. ఈ డ్రైవ్ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని చెప్పారు. తహశీల్దార్లు, ఆర్డీవోల ద్వారా కలెక్టర్లను ప్రతి రోజూ మానిటరింగ్ చేయాలని సూచించారు.

Tags:    

Similar News