Revanth Reddy : కొత్త హైకోర్ట్కు లైన్ క్లియర్.. ఏకంగా 100 ఎకరాల్లో.. కట్టేది ఎక్కడంటే?

Byline :  Bharath
Update: 2024-01-05 12:03 GMT

తెలంగాణలో కొత్త ఏర్పాడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మరంగా పనులు చేపడుతుంది. ఈ మేరకు నూతన హైకోర్ట్ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్ట్ నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ప్రేమావతి మండలంలోని బుద్వేల్ గ్రామ పరిధిలో గల 100 ఎకరాల భూమిని హైకోర్ట్ నిర్మాణానికి కేటాయించింది. ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ భవనం, కోర్టుకు సరిపోవడం లేదని న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.

అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్తకు చేరుకుంది. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి అభ్యర్థనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త భవన నిర్మాణానికి 100 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కొత్త భవనం పూర్తయ్యేవరకు పాత భవనంలోనే కార్యకలాపాలు జరుపాలని సూచించింది.

Tags:    

Similar News