ప్రభుత్వం కీలక నిర్ణయం.. ధూపదీప నైవేద్యం అలవెన్స్లు పెంపు
ఆలయ అర్చకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధూపదీప నైవేద్యం అలవెన్స్ లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇస్తున్న రూ. 6వేల నెల వేతనాన్ని రూ.10 వేలకు పెంచింది. అర్చకుని గౌరవ వేతనంగా రూ.6వేలు, ఆలయంలో పూజలు, ఇతర నిర్వహణకు రూ.4వేలు (మొత్తం కలిపి రూ.10వేలు) ఇస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ఆలయాల్లో నిరంతర పూజలు, ఇతర కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2009లో సీఎం కేసీఆర్ ఆదేశంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ధూపదీప నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట అర్చకులకు గౌరవ వేతనంగా రూ.2500గా నిర్ణయించింది. కానీ ఈవేతనం అర్చకులకు ఏ మాత్రం సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం.. 2015లో రూ.6వేలకు పెంచింది.