ఏపీపై చర్యలు తీసుకోండి.. కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ..

By :  Krishna
Update: 2023-09-27 11:39 GMT

పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సూచించింది ( Telangana Govt On Polavaram Back Water ). దీనిపై సెంట్రల్‌ వాటర్‌ బోర్డు చైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఈ విషయంలో తమ అభ్యంతరాలను, వినతులను పట్టించుకోవడం లేదని తెలిపింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో 954 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని లేఖలో ప్రస్తావించారు.

గతంలో తాము లేవనెత్తిన 9 అంశాల్లో ఒక్కదానిపై ఏపీ చర్యలు తీసుకోలేదని లేఖలో తెలిపారు. సుప్రీంకోర్టులో కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం తెలిపింది. పీపీఏ నుంచి సమన్వయం లోపం ఉందని లేఖలో తెలిపారు. సీడబ్ల్యూసీ, పీపీఏ భేటీల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని.. తమ అభ్యంతరాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

Tags:    

Similar News