TS ICET 2024 : ఐసెట్ షెడ్యూల్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే?

By :  Kiran
Update: 2024-02-10 14:22 GMT

ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒక్కొక్కటిగా ప్రకటిస్తుంది. తాజాగా టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించారు. మార్చి 5వ తేదీన ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అనంతరం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ద్వారా పరీక్ష ఉంటుంది.

కాగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం జేఎన్టీయూ హైదరాబాద్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది. 

Tags:    

Similar News