TS E Challan Discount : వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ రాయితీ..?

Byline :  Veerendra Prasad
Update: 2023-12-22 05:33 GMT

రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు గత ప్రభుత్వం చేపట్టిన రాయితీ విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కూడా మరోసారి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోందని సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని.. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక జీవో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

2022లో గత ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు చలాన్లపై రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. రాయితీ ఉండడంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చలానాలు కూడా కట్టేశారు జనాలు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు జమ అయ్యాయి. అయితే ఇదే మాదిరిగా మరోసారి వాహనదారులకు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాల నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారట.

గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉంటే.. వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇవ్వగా.. దీంతో వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు జనం ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది.




Tags:    

Similar News