గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆర్టీసీ ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. అందులో భాగంగానే టీ9 టికెట్ ను తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ప్రస్తుతం అందులో సవరణలు చేస్తూ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇదివరకు టీ9 టికెట్ తీసుకుంటే.. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రయాణించే వీలుండేది. ఇప్పుడు టీ9 టికెట్ సమయాల్లో మార్పు తీసుకొచ్చింది. ఇక.. ఉదయం 9నుంచి సాయంత్రం9 గంటల వరకు టీ9 టికెట్ చెల్లుబాటు అయ్యేలా రూల్ పాస్ చేసింది.
అంతేకాకుండా టీ9 టికెట్ తో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వెసులు బాటు కల్పించింది. రూ. 100 చెల్లించి టీ9 టికెట్ తీసుకున్న ప్రయాణికులు.. తిరుగు ప్రయాణంలో ఎక్స్ ప్రెస్ లో రూ. 20 అదనంగా చెల్లించి కాంబినేషన్ టికెట్ తీసుకోవల్సి ఉంటుంది. టీ9 టికెట్ సవరణ రూల్స్.. ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.