అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) నియామక పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. అభ్యర్థులు జూన్ 21 ఉదయం 10గంటల నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ లింకును కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
ఈ నెల 28న ఏఎంవీఐ నియామక పరీక్ష జరగనుంది. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు అప్లికేషన్లు స్వీకరించింది. వాస్తవానికి ఈ పరీక్ష ఏప్రిల్ 23న జరగాల్సి ఉంది. అయితే టీఎస్పీఎస్పీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి రావడంతో కమిషన్ ఎగ్జామ్ డేట్ రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన రాత పరీక్ష తేదీని జూన్ 28కు మార్చింది.