TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

Byline :  Veerendra Prasad
Update: 2023-12-12 06:11 GMT

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదించలేదు. ప్రభుత్వం మారడంతో ఆయన సోమవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు పంపారు. అయితే గవర్నర్.. జనార్థన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బాధ్యులు ఎవరో తెలియకుండా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకులకు బాధ్యులను చేస్తూ డీవోపీటీకి గవర్నర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించారు జనార్ధన్ రెడ్డి. అయితే గవర్నర్‌ ఆయన రాజీనామాను ఆమోదించినట్లు కొన్ని మీడియా సంస్థలు నిన్న వార్తలు రాశాయి. ఆ వార్తలు అవాస్తవమంటూ రాజ్‌భవన్‌ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు జనార్ధన్ రెడ్డి. ఈ భేటీలో ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లు సహా పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత జనార్ధన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఐఏఎస్‌ అధికారిగా ఉన్న జనార్దన్‌రెడ్డిని 2021, మే 20న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా అప్పటి ప్ర భుత్వం నియమించింది. మే 21న ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Tags:    

Similar News