TSPSC Member Resigned : టీఎస్పీఎస్సీలో మరో రాజీనామా.. నిన్న చైర్మన్.. ఇవాళ..
టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. ఇవాళ బోర్డు సభ్యుడు ఆర్.సత్యనారాయణ రాజీనామా చేశారు. తాను ఏ తప్పు చేయలేదు.. అయినా తప్పుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు తెలిపారు. తన విద్యార్థి జీవితం నుంచి ఎప్పుడు నిరుద్యోగుల పక్షమే అని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
కాగా సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దనరెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవచ్చని సమాచారం. మరోవైపు టీఎస్పీఎస్పీపై ఇవాళ రేవంత్ సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, టీఎస్పీఎస్పీ ప్రక్షాళనపై ఉన్నతాధికారులతో చర్చించారు. కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారమే పరీక్షలు నిర్వహించడపై చర్చలు జరిపారు.