TSPSC Group 2: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ - 2 పరీక్ష మళ్లీ వాయిదా..

By :  Kiran
Update: 2023-10-10 16:33 GMT

గ్రూప్‌-2 పరీక్షను టీఎస్పీఎస్సీ మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2, 3వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎగ్జామ్ను రీషెడ్యూల్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ ను వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అప్పుట్లో వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్‌ -2 పరీక్ష పోస్ట్పోన్ చేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. వారి నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలనలోకి తీసుకున్న ప్రభుత్వం గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేసింది. నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ 783 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.


Tags:    

Similar News