TSPSC అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష వాయిదా!!

Byline :  Veerendra Prasad
Update: 2023-09-06 02:26 GMT

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యర్థులకు అలర్ట్. ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో భర్తీ కోసం కోసం నిర్వహించనున్న ఫిజికల్ డైరెక్టర్ నియామక పరీక్ష వాయిదా పడింది. ఈ విషయాన్ని టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 11వ తేదీన(సోమవారం) జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC తెలిపింది. ఈ పరీక్షను తిరిగి నవంబర్ 14వ తేదీన(గురువారం) నిర్వహిస్తామని వెల్లడించింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల నుంచి ఒక పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు మరో పరీక్ష ఉంటాయని తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వైబ్ సైట్‌( https://www.tspsc.gov.in/ )లో అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.




 


ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్ల నియామకానికి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ పరీక్షల హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబ‌రు 12వ తేదీ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు సీబీటీ(CBT) విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షలకు వారం రోజుల ముందు నుంచే హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దాదాపు 1392 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఒక అభ్యర్థి రెండు మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసినా.. సబ్జెక్టు వారీగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలిని సూచించింది TSPSC. అభ్యర్థులు మోడల్‌ పరీక్షలు రాయొచ్చని.. ఆ లింక్‌ను వెబ్‌సైట్లో ఉంచినట్లు వెల్లడించింది.




Tags:    

Similar News