TSRTC Cargo Services: టీఎస్ఆర్టీసీ కార్గో సేవల్లో మార్పు

Byline :  Bharath
Update: 2023-10-31 01:45 GMT

సరుకు రవాణాను సులభతరం చేస్తూ విశేష సేవలందిస్తున్న కార్గో (పార్సిల్‌) సేవల్లో మార్పు తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఇకనుంచి బార్ కోడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట కరీంనగర్, సికింద్రాబాద్ (జేబీఎస్) బస్టాండ్లలో ఉండే కార్గో బుకింగ్ సెంటర్లలో అమలు చేయనున్నారు. దీనికోసం కార్గో బుకింగ్ కేంద్రాల్లో కంప్యూటర్స్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్సిళ్లు బుకింగ్ చేసినచోట, డెలివరీ చేసిన చోట ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తప్పుడు వివరాలు నమోదు అయితే.. పార్సిళ్లు చేరాల్సిన చోటుకు కాకుండా వేరే ప్రాంతాలకు డెలివరీ అవుతాయి.

ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే బార్ కోడింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పార్సిల్ బుక్ చేసిన చోట ఆన్ లైన్ వివరాలు నమోదు చేస్తే చాలు.. చేరిన చోట నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ అయిన చోట బార్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు తెలిసిపోతాయి. అంతేకాకుండా పాత విధానంలో మొబైల్ ఫోన్లు, టీవీలు, బల్బులు లాంటి వస్తులు ఏవి పంపినా.. ఎలక్ట్రానిక్ వస్తువు అని నమోదు చేసేవారు. కానీ తాజా విధానంలో ఏ వస్తువో స్పష్టంగా తెలిసిపోతుంది. దానిద్వారా సర్వీస్ చేసేవాళ్లు మరింత జాగ్రత్తగా తీసుకెళ్లే వీలుంటుంది.

Tags:    

Similar News