టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుఖవార్త చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం.. ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గించింది. దీనివల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం కొంత తగ్గుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20, 350 కిలోమీటర్లకుపైన రూ.30 ఛార్జీని తగ్గించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునేవాళ్లు భారీగా పెరిగిపోయారని, ప్రతిరోజూ 15వేల వరకు ముందస్తు బుకింగ్స్ జరుగుతున్నాయిని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దాంతో ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని కొంత తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు