TSRTC Dasara Offer: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఈసారి పురుషులకు కూడా

By :  Bharath
Update: 2023-10-10 15:40 GMT

టీఎస్ఆర్టీసీని నష్టాలబారి నుంచి లాభాల బాటపట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ.. కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దసరా ఆఫర్లను ప్రకటించిన ఆర్టీసీ.. ఇప్పుడు మరో బంపరాఫర్ ను తీసుకొచ్చింది. రాఖీ పండుగ వేళ ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా దసరాకు కూడా ఆఫర్ పెట్టాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. రాఖీ పండుగకు కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించిన ఆర్టీసీ.. ఇప్పుడు ఈ ఆఫర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

దసరా పండుగ వేళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను అందించాలని నిర్ణయించింది. దానికోసం చేయాల్సిందల్లా ఒక్కటే. జర్నీ పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, ఫోన్ నెంబర్ రాసి.. ప్రతీ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్సుల్లో వేయాలి. ప్రతీ రీజియన్ నుంచి ఐదుగురు ఫురుషులు, ఐదుగురు మహిళలకు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు.. తిరిగి అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు లక్కీ డ్రాలో పాల్గొనచ్చు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

Tags:    

Similar News