TSRTC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల డీఏ..

Byline :  Krishna
Update: 2023-09-02 14:39 GMT

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నెల జీతంతో కలిసి డీఏను చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




 


‘‘పెండింగ్లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.




 


మరోవైపు రాఖీ పౌర్ణమి నాడు టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. గురవారం ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ నాడు రూ.21.66 కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి రూ.కోటి ఎక్కువ వచ్చింది. అంతేకాకుండా రాఖీ పండగ నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.    




 


Tags:    

Similar News