ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

Byline :  Bharath
Update: 2024-03-12 05:31 GMT

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం (మార్చి 12) ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. నెక్లెస్ రోడ్డులోకి అంబేద్కర్ స్టాచు నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆగస్ట్ వరకు మొత్తం 500 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఇందులో భాగంగా మంగళవారం నుంచి 22 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. కాగా మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని అధికారులు చెప్పారు. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్ తో తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ బస్సుల్లో కూడా మెట్రో ఎక్స్ ప్రెస్ లో ఉన్న సాధారణ చార్జీలే ఉంటాయని ఆర్టీసీ తెలిపింది.

Tags:    

Similar News