TSRTC Retirement: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ ఏజ్..
By : Krishna
Update: 2023-10-14 04:30 GMT
ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును ప్రతిపాదించింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61ఏళ్లకు పెంచాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61ఏళ్లుగా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం దక్కింది.
ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగుల విలీనంపై విధివిధానాలు, ఉద్యోగుల క్యాడర్ ఖరారుకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనను కమిటీకి అందించాలని ఆర్టీసీ ఎండీకి రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ నెల 11న లేఖ రాశారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.