ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ‘పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్’ను టీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. జూలై 18 నుంచి ఈ బస్ పాస్ అందుబాటులోకి రానుంది.
ముందుగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 10 కి.మీ. పరిధిలో నెలకు రూ.800, 5 కి.మీ పరిధిలో నెలకు రూ.500తో ఈ పాస్ ధర ఉండనుంది. ఇంతకుముందు 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా..ఇప్పుడు టీఆఎస్ఆర్టీసీ రాయితీ కల్పించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి అని ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.