Hyderabad To Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇకపై..

Byline :  Krishna
Update: 2024-02-10 06:18 GMT

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఈ ప్రసిద్ధ ఆలయానికి తెలంగాణ నుంచి ఎంతో మంది వెళ్తుంటారు. హైదరాబాద్ టు శ్రీశైలం మార్గంలో ఏసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ - శ్రీశైలం రూట్లో ఏసీ బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. హైదరాబాద్-శ్రీశైలం మధ్య కొత్తగా 10 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.




 


ప్రయాణికుల కోసం ఆర్టీసీ కొత్తగా 85 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో 10 ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులను ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ వస్తుండడంతో నాన్ ఏసీ బస్సులలో వెళ్లేందుకు ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఏసీ బస్సులకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ‘రాజధాని’ బస్సు పొడవు ఎక్కువ ఉండటం వల్ల ఘాట్‌ రోడ్ల మలుపుల్లో తిరగడం కష్టంగా మారడంతో సూపర్‌లగ్జరీ బస్సులతోనే ఇన్నాళ్లు సరిపెట్టింది. తాజాగా సూప ర్‌లగ్జరీ బస్‌ తరహాలోనే రాజధాని బస్సును తయారు చేయించారు.


Tags:    

Similar News