TSRTC Management ప్రయాణికులకు TSRTC అలర్ట్... రేపట్నుంచి ఈ సేవలు బంద్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-31 06:00 GMT

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

"ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. సోమవారం(జనవరి 1, 2024) నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు." అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగాప్రయాణం చేయవచ్చు. ఈ పథకం డిసెంబర్ 9 నుంచి అమలు అవతుండగా.. అప్పటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పథకం అమలుకు ముందు మహిళా ప్రయాణికుల సంఖ్య రోజువారీ 12 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 30 లక్షల వరకు పెరిగింది. కొన్ని రూట్లలో కాలు పెట్టేందుకు కూడా ఖాళీ స్థలం లేకుండా బస్సులు నిండిపోతున్నాయి.




Tags:    

Similar News